భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పుణ్యస్నానాలు
కోనేరుసెంటర్: కార్తిక పౌర్ణమి పుణ్యస్నానాలు భక్తిశ్రద్ధల నడుమ శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. మంగినపూడి బీచ్‌లో భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచే స్నానాలు మొదలుపెట్టిన భక్తులు అనంతరం సూర్య భగవానుడికి నమస్కారాలు చేసి బీచ్ ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం వరకు కొనసాగిన స్నానాలు....
బీచ్ ఒడ్డున మట్టి శివలింగాలను తయారుచేసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బీచ్ ఒడ్డున ఉన్న శివలింగంకు పెద్ద ఎత్తున హారతులు పట్టి శివుడికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. సాయంత్రానికి సుమారు లక్షన్నర మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అఽధికారులు చెప్పారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య సగానికిపైగా తగ్గారని అంటున్నారు. గురువారం రాత్రి సముద్రం రోడ్డుపైకి రావడం కూడా కారణం.
ఏర్పాట్లు పర్యవేక్షణ...
సముద్రస్నానాలకు విచ్చేసిన భక్తులకు అవసరమైన ఏర్పాట్లును అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. డీపీవో కె.అరుణ భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. ఆమెతో పాటు బందరు ఆర్డీవో స్వాతి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. బందరు ఎంపీడీవో సీహెచ్ వెంకటేష్, బీచ్‌లో విధులకు హాజరైన సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విధులు నిర్వర్తించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 200 మంది పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రత పనులు చేశారు.
లక్ష మందికిపైగా భక్తులు
పుణ్యస్నానాల ఆచరణ
ఏర్పాట్లను దగ్గరుండి
పర్యవేక్షించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment