కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2024
అన్నదాతకు దిగుబడి దిగులు..
సాక్షి, మచిలీపట్నం:అన్నదాతకు దిగుబడి దిగులు మొదలైంది. జిల్లాలో వరి కోతలు ఆరంభమయ్యాయి. రెండున్నర నెలల క్రితం కృష్ణా నదికి వచ్చిన భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరోవైపు తేరుకున్న పంట సైతం దెబ్బతినడంతో దిగుబడి బాగా తగ్గింది. వేల హెక్టార్లలో పంట పూర్తిగా తడిచి పనికి రాకుండా పోవడం, వారం రోజులు నీటిలో ఉండి, వరద తగ్గాక, సస్యరక్షణ చర్యలతో తిరిగి జీవం పోసుకున్నా.. అనుకున్న మేరకు పంట రాలేదు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే దిగుబడి బాగా తగ్గడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో సాగు.. వరద ప్రభావం ఇలా..
ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల హెక్టార్లలో
పంట సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 1.40 లక్షల హెక్టార్లు, పత్తి 300, వేరుశనగ 765, మినుములు 520, చెరుకు 265, మొక్క జొన్న 112 హెక్టర్ల చొప్పున సాగైంది. వరదల కారణంగా 44,521 హెక్టార్ల పంట ముంపునకు గురైంది. మరో 4,070 హెక్టార్ల ఉద్యాన, 50 హెక్టార్ల పట్టు పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి రైతుకే భారీ నష్టం చేకూరింది.
బాధితులుగా 40 వేల మంది రైతులు....
వరద కారణంగా జిల్లాలో సుమారు 40 వేల మంది రైతులు బాధితులుగా మిగిలారు. సెప్టెంబరు 11వ తేదీన కేంద్ర బృందానికి అందించిన నష్టం అంచనాల ప్రకారం రూ.493.06 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదించారు. ఇందులో వ్యవసాయ పంటలకు రూ.385.24 కోట్లుగా, ఉద్యాన పంటలకు రూ.107.82 కోట్లు అంచనా వేశారు.
7
జిల్లాలో ప్రధాన పంట వరి
జిల్లాలో ప్రధాన పంట వరి. వరదల కారణంగా వరి పంట బాగా దెబ్బతిని, దిగుబడి పడిపోయింది. గత ఏడాది 10.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఈ ఏడాది 9.72 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన గత ఏడాదితో పోల్చితే 81వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వరదపాలైంది.
వరదల ప్రభావంతో
దెబ్బతిన్న వరి పంట
భారీగా తగ్గిన దిగుబడి
81వేల మెట్రిక్ టన్నులకు పైగా తగ్గుదల
9.72 లక్షల మెట్రిక్ టన్నుల
దిగుబడి వస్తుందని అంచనా
గత ఏడాది 10.53 లక్షల
మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి
Comments
Please login to add a commentAdd a comment