● కనులపండువగా కోటి దీపోత్సవం
కోటిదీప కాంతుల్లో ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో కోటి దీపోత్సవాన్ని కనులపండువగా
నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట పూలతో శ్రీచక్ర రూపాన్ని తీర్చిదిద్ది, అందులో లక్ష ఒత్తులను వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు.
దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ సత్యనారాయణ ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం రాజగోపురం ఎదుట వివిధ ఆకృతుల్లో ఓంకారం, స్వస్తిక్, శివలింగం, త్రిశూలం, డమరుకం, నంది రూపాల్లో దీపాలను వెలిగించారు.
Comments
Please login to add a commentAdd a comment