చిలకలపూడి(మచిలీపట్నం): నగదు చెల్లింపు ఆలస్యం కావటంతో ఖాతాదారునికి వడ్డీ చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మి రాయల మంగళవారం తీర్పు చెప్పారు. బంటుమిల్లికి చెందిన జె.వి.ఉమామహేశ్వరరావు కపిల్ చిట్స్ గుడివాడ బ్రాంచ్‌లో 2020లో రూ.2 లక్షలకు చిట్ వేశారు. చిట్ పాడిన అనంతరం చిట్ మొత్తాన్ని 2022లో చెల్లించారు. చిట్ మొత్తం ఆలస్యంగా చెల్లించటంతో వడ్డీ ఇవ్వాలని కోరితే చిట్ ఫండ్ సంస్థ స్పందించలేదు. ఉమామహేశ్వరరావు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కమిషన్ సభ్యులు పూర్వాపరాలను విచారించిన అనంతరం.. చిట్ మొత్తంపై 9 శాతం వడ్డీ , మానసిక వేదన కలిగించినందుకు రూ.10 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా బాధితుడికి అందజేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment