ప్రతిభకు పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పరీక్ష

Published Wed, Nov 27 2024 7:17 AM | Last Updated on Wed, Nov 27 2024 7:17 AM

ప్రతి

ప్రతిభకు పరీక్ష

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగునకు కేంద్రం చర్యలు

విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకుంటాం

పరఖ్‌ పర్యవేక్షణ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సామర్థ్య తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను డిసెంబరు 4వ తేదీన ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఏ రకమైన ప్రాంతాల్లో ఏ రకమైన విద్యార్థుల సామర్ధ్యం ఎలా ఉందో తెలుసుకుని జాతీయ విద్యావిధానం– 2020 ద్వారా విద్యార్థులకు బోధనలో మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మూడు, ఆరు తరగతుల విద్యార్థులకు సంబంధించి మ్యాథ్స్‌, లాంగ్వేజ్‌, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌పై ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

– పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): మానవ వికాసానికి విద్య ప్రధాన ఆయుధం. అటువంటి విద్యాబోధన ఏ విధంగా కొనసాగుతోంది అనే అంశంపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెర్ఫార్మెన్స్‌ అసెస్‌మెంట్‌ రివ్యూ అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫర్‌ హాలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో పరఖ్‌ రాష్ట్రీయ – సర్వేక్షణ్‌ – 2024ను (గతంలో నాస్‌) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సర్వేను 2021లో చివరిసారిగా నిర్వహించారు. తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహణకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఎస్‌సీఈఆర్‌టీ చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన సామర్థ్య పరీక్షను డిసెంబర్‌ నాలుగో తేదీన జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించనున్నారు.

జిల్లాలో ఇలా..

కృష్ణా జిల్లాలో 124 పాఠశాలలను ఈ పరీక్ష కోసం ఎంపిక చేశారు. ఇందులో ఒక్కో పాఠశాల నుంచి తరగతికి 30 మంది చొప్పున మూడు తరగతులకు సంబంధించిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. పరాఖ్‌ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా స్థాయి కోఆర్డినేటర్‌గా, డీసీఈబీ సెక్రటరీ సహాయ జిల్లా స్థాయి కో ఆర్డినేటర్‌గా వ్యవ హరించనుండగా సమగ్ర శిక్ష ఏఎంఓ, డైట్‌ ప్రిన్సి పాల్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్లు ఈ పరీక్షల నిర్వహణకు సహకారం అందించ నున్నారు. మండల స్థాయిలో పరీక్షల నిర్వాహకులుగా ఎంఈఓలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధా నోపాధ్యాయులు వ్యవహరిస్తారు. పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది.

పరీక్షలు ఇలా..

ఎస్‌సీఈఆర్‌టీ నిర్వహించే పరఖ్‌ పరీక్షకు ముందుగా ప్రాక్టీస్‌ పేపర్ల ద్వారా తర్ఫీదు ఇస్తారు. ఇందులో మూడు, ఆరు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, పరిసరాల విజ్ఞానం, తొమ్మిదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టులపై పరీక్షలు ఉంటాయి. మూడో తరగతి విద్యార్థులకు అదే తరగతి సిలబస్‌ ఉంటుంది. వీరికి 45 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. ఆరో తరగతి విద్యార్థులకు ఐదో తరగతి సిలబస్‌ ఉంటుంది. వీరికి 51 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎనిమిదో తరగతి సిలబస్‌ ఉంటుంది. వీరికి 60 ప్రశ్నలతో 120 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్‌ షీటు విధానంలో పరీక్ష జరుగుతుంది.

కృష్ణాజిల్లాలో పరఖ్‌ పర్యవేక్షణకు 124 పాఠశాలలు ఎంపిక 3, 6, 9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాల పరిశీలన 4న ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహణ

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రతిభకు పరీక్ష 1
1/1

ప్రతిభకు పరీక్ష

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement