దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ యాప్ ప్రారంభం
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ అభియాన్’ యాప్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్ సమావేశ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇది ఒక ఆయుర్వేదం యాప్ అని, దీనిని ఆరోగ్య సంరక్షణకు ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయుర్వేద పద్ధతిలో ఆరోగ్య సూచనలు, ఆహార నియమాలు పాటించేందుకు అనుకూల మార్గదర్శకాలు అందిస్తుందన్నారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ప్రసన్న, డాక్టర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అనుకూల ఆహార అలవాట్లు, జీవన శైలి మార్గదర్శకాలను అందించటం, ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుర్వేద పద్ధతులను ప్రోత్సహించటం యాప్ ఉద్దేశమన్నారు. ఈ యాప్‌ను దేశవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీ వరకు ఆయుర్వేద కళాశాలలు, ఆస్పత్రి, డిస్పెన్సరీల్లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ యాప్‌ను వినియోగించుకుని వారి శరీర ధర్మ స్వభావాన్ని అంచనా వేసుకోవచ్చని, ఆయుర్వేద సూచనలు పొందవచ్చని సూచించారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య సంరక్షణను చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆయుర్వేద వైద్యులు మాధవి, రత్నకుమారి, ఉషారాణి, జావెద్‌ఖాన్, సుభాష్‌చంద్రబోస్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment