ఉమ్మడి కృష్ణా కేబుల్ ఆపరేటర్ల సమావేశం
గన్నవరం: స్థానిక కొత్తపేటలోని రోటరీ ఆడిటోరియంలో శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా కేబుల్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జి.వెంకటరెడ్డికి కేబుల్ ఆపరేటర్లు పలు సమస్యలను విన్నవించారు. సెట్‌ఆప్ బాక్స్ రెంటల్ కింద కేబుల్ ఆపరేటర్లు చెల్లిస్తున్న రూ.59 తొలగించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ సర్వీస్ సమస్యలను పరిష్కరించాలని, కేబుల్ ఆపరేటర్లకు అవసరమైన సెట్‌ఆప్ బాక్స్‌లను సరఫరా చేయాలన్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment