మాదకద్రవ్యాలను అరికట్టాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. తన చాంబర్‌లో ఎస్పీ ఆర్ గంగాధరరావు, జేసీ గీతాంజలిశర్మతో కలిసి మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల వద్ద మాదకద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా ఉంచాలన్నారు. విద్యార్థులు ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే వారి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. ఇందు కోసం ముందుగా కళాశాలల ప్రిన్సిపాల్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి మాదకద్ర వ్యాలు వినియోగిస్తున్న విద్యార్థులను గుర్తించాలన్నారు. మాదకద్రవ్యాల గుర్తింపు కోసం సంబంధిత పరికరాలు కొనుగోలు చేయటం ద్వారా అరికట్టొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపాలని ఎస్పీ ఆర్.గంగాధరరావు కలెక్టర్‌ను కోరారు. మచిలీపట్నంలో ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇప్పటికే మాదకద్రవ్యాలను సేవించి చికిత్స పొందుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి.గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment