అమ్మ సన్నిధికే..
కృష్ణాజిల్లా
దారులన్నీ
7
మంగళవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
–8లోu
పుస్తక మహోత్సవం పోస్టర్ల ఆవిష్కరణ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంగణంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండు నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ పోస్టర్లను సంస్థ గౌరవాధ్యక్షుడు బెల్లపు బాబ్జీ తదితరులతో కలిసి అధ్యక్ష కార్యదర్శులు కె.లక్ష్మయ్య, టి.మనోహర్‌నాయుడు సోమవారం ఆవిష్కరించారు. బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాల యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. 34 సంవ త్సరాలుగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి సారిగా ఇందిరాగాంధీ కార్పారేషన్ స్టేడియంలో సుమారు 200 స్టాళ్లతో నిర్వహించనున్నా మని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారని, అనంతరం జరిగే సభకు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది పుస్తక మహోత్సవ ప్రాంగణానికి సాహితీ నవజీవన్ లింక్స్ అధినేత పిడికిటి రామకోటేశ్వరరావు పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరుద్ర, దాశరధి కృష్ణమాచార్యులు, నాజర్ (బుర్రకథ పితామహుడు), నార్ల చిరంజీవి, ఆలూరి బైరాగి, ఎన్.నటరాజన్ (శారద), సినీ నటి భానుమతి తదితరుల శతజయంతి సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ నాకు నచ్చిన పుస్తకం, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అంశంపై ఓపెన్ డయాస్‌పై సందర్శకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తు న్నామన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జె.పి.ప్రసాద్, సహాయ కార్యదర్శి కె.రవి, కోశాధికారి జి.లక్ష్మి, సాహిత్య కార్యక్రమాల సమన్వయకర్త గోళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
దీక్ష విరమణకు తరలివస్తున్న భవానీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీ మాలధారులతో వీధులన్నీ పోటెత్తుతున్నాయి. దారులన్నీ అమ్మ సన్నిధికే అన్న చందంగా కనిపిస్తున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన సోమవారం తెల్లవారుజామున మూడు నుంచి నుంచి రాత్రి 11 గంటల వరకు భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భవానీలు అధిక సంఖ్యలతో తరలిరావడంతో వినాయకుడి గుడి వద్ద క్యూలైన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి కొండ దిగువన లడ్డూ కౌంటర్‌కు చేరేందుకు మూడు గంటల సమయం పడుతోంది. రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు గిరి ప్రదక్షిణ మార్గంలో భవానీల రద్దీ కనిపించింది. రైళ్లు, బస్సులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రవాణా వాహనాల ద్వారా నగరానికి చేరుకుంటున్న భవానీలు తొలుత పద్మావతి, సీతమ్మ వారి పాదాలు, భవానీ, పున్నమి ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మ వారి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు వచ్చే భవానీల సంఖ్యను పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణంలో అధికారులకు సమాచారం అందిస్తోంది.
న్యూస్‌రీల్
దీక్ష విరమణల్లో నేడు కీలకం
భవానీ దీక్ష విరమణలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. దీక్ష విరమణలు బుధవారం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్నాయి. ఈ నేపథ్యలో మంగళవారం భవానీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. మంగళవారం సెంటిమెంట్‌గా దీక్షలను విరమించరనే అభిప్రాయం ఉన్నా సాయంత్రం నుంచి గిరిప్రదక్షిణ చేసుకుని బుధవారం ఉదయం దీక్షలను విరమించే అవకాశం ఉందని గురుభవానీలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి భవానీల తాకిడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో మంగళ, బుధవారం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు ఆలయ అధికారులతో చర్చించారు. కీలకమైన ప్రాంతాల్లో సోమవారం ఈఓ, డీఈఓ రత్నరాజు మరో మారు పర్య టించి సిబ్బందికి సూచనలు చేశారు. భవానీలు ఇరుముడులను సమర్పించే కౌంటర్లు, హోమగుండాలు, అన్నదానం, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలతో పాటు లడ్డూ తయారీ పోటును పరిశీలించారు. మంగళవారం ఒక్క రోజే సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉందని పోలీసు శాఖ భావిస్తోంది.
కొనసాగుతున్న భవానీల రద్దీ భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ రేపటితో దీక్షల విరమణ పరిసమాప్తం
గిరి ప్రదక్షిణ మార్గంలో ఆధ్యాత్మిక శోభ
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ భవానీలు గిరి ప్రదక్షిణ చేపడుతున్నారు. భవానీలతో ఈ మార్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కుమ్మరిపాలెం మొదలు నాలుగు స్తంభాల సెంటర్, చెరువు సెంటర్, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేటీరోడ్డుతో పాటు బ్రాహ్మణ వీధిలో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టిన భవానీల సేవలో తరిస్తున్నారు. బిస్కెట్లు, పాలు, పండ్లు, అల్పాహారం, భోజనాలను అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment