టేబుల్ టెన్నిస్ పోటీల్లో క్రీడాకారుల సత్తా
విజయవాడస్పోర్ట్స్: కాకినాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజయవాడ క్రీడాకారులు పి. కిరణ్ తేజ, ఎ. అభిరామ్ సత్తా చాటారు. అండర్–15 టీం విభాగంలో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ఇద్దరు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించి సిల్వర్ మెడల్ సాధించారు. వీరిలో కిరణ్ తేజ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో కోచ్‌లు షారుఖ్ అక్రమ్, గౌస్ బాషా వద్ద, అభిరామ్ కోచ్ బి.శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందుతున్నారు. ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి పతకం సాధించిన క్రీడాకారులను ఏపీ టీటీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్, విశ్వనాథ్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి బలరాం అభినందించారు.
సమస్యలపై సమరశీల పోరాటాలు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ పిలుపునిచ్చారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు సోమవారం ముగిశాయి. ఎన్టీఆర్ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శిగా సీహెచ్.వెంకటేశ్వరరావు, అధ్యక్షుడిగా జి. గోపినాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎం.కుమార్ నాయక్, ఎస్.కే జాహిద, టి.కుమారస్వామి, టి.ప్రణితా, సహాయ కారదర్శులుగా బి.మాధవ్, ఎం.జ్వాలిత, ఎం.చరణ్, కమిటీ సభ్యులుగా వి. షణ్ముఖ, ఎస్.కె షరీఫ్, సీహెచ్.మోహన్‌కృష్ణ, ఎస్.ప్రసాద్, డి.పెదబాబు, ఎన్.కావ్య, పి.ఓజేస్విన్, యోగి సత్య, ఎస్.కె కాజు,ఎస్.ప్రేమ్ ఎన్నికయ్యారు.
క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మూలపాడులో నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్–12 బాలుర క్రికెట్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టును కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి సోమవారం ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన ధరణ్‌సూర్య (కెప్టెన్), దృవ్‌తేజ్ (వైస్ కెప్టెన్), సుబ్రహ్మణ్యం, జైరామ్, వెంకటకార్తికేయ, నిఖిలేష్, రెహాన్‌బేగ్, సాత్విక్, సాయిరామ్, సాయిరాజేందర్, అభినవ్‌సాయి, జయవర్ధన, మౌలిక్, జైరాఘవేంద్ర, నీరజ్, వెంకటేష్, సాయిశ్రీకర్, రిషిత్‌కుమార్, రిషాన్, పవన్‌కుమార్, జశ్విన్, కెవిన్‌కృష్ణను జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎస్.రామ్‌కుమార్ (గాంధీ) వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించండి
ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన
పమిడిముక్కల: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇప్పటినుంచే ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ప్రతి విద్యార్థిని ప్రత్యేక దృష్టితో పరిశీలించి వెనుకబడి ఉన్న పాఠ్యాంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పమిడిముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులతో కలిసి సహపంక్తి
భోజనం చేశారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, నాణ్యత ఏవిధంగా
ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతలో లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మండలస్థాయి సైన్స్ ఫెయిర్‌ను పరిశీలించి వైజ్ఞానిక ప్రదర్శనలను విద్యార్థుల నుంచి ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.
ఎంఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ నవీన్‌కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్ ముళ్లపూడి సునీత, కృష్ణాపురం డీసీ చైర్మన్ నాదెళ్ల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment