గ్రీన్‌కో గెస్ట్ హౌస్‌పై తెలంగాణ ఏసీబీ దాడులు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏసీబీ, వివిధ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు గెస్ట్‌హౌస్ వద్దకు అధికారులు చేరుకున్నారు. గెస్ట్ హౌస్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డుతో మాట్లాడి నిర్వాహకులను పిలిపించారు. అనంతరం సంస్థ పెద్దలతో మాట్లాడి అధికారులు 11 గంటలకు లోపలకు వెళ్లారు.
ఫార్ములా–ఈ రేసు కేసులో భాగంగా..
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా–ఈ రేసులో ఏసీఈ డెవలపర్స్ భాగస్వామ్యులయ్యారనే కారణంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తనిఖీల అనంతరం మీడియాకు వివరాలు తెలియపరుస్తారా అని ప్రశ్నించగా వారు తమదేమి లేదని ఉన్నతాధికారులు చెప్పిన మీదట తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment