ఏడో రోజు కొనసాగిన పోలీస్ సెలక్షన్స్
కోనేరుసెంటర్: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ సెలక్షన్స్ ఏడో రోజు కొనసాగాయి. మంగళవారం జరిగిన సెలక్షన్స్‌కు 600 మంది అభ్యర్థులకుగానూ 284 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. సెలక్షన్స్‌లో ఇటీవల జరిగిన పలు సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అభ్యర్థులు ఎటువంటి అనారోగ్యం, అస్వస్థతకు గురి కాకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. సెలక్షన్స్‌కు హాజరైన అభ్యర్థులు నీరసించకుండా ఉండేందుకు గ్రౌండ్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయించారు. పరుగు పందెంలో అభ్యర్థులు సొమ్మసిల్లకుండా ఉండేందుకు గ్లూకోజ్‌తో పాటు పలు ఆరోగ్యకరమైన పానీయాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులతో ఆయన స్వయంగా మాట్లాడి సెలక్షన్స్‌కు ఏ విధంగా సిద్ధం కావాలి, మానసిక ఒత్తిడి నుంచి ఏ విధంగా ఉపశమనం పొందాలి వంటి విషయాలను వివరించి, వారిలో ఆత్మస్థైరాన్యి నింపారు. 284 మందిలో 184 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా మిగిలిన 100 మంది డిస్‌క్వాలిఫై అయ్యారు. అనారోగ్య కారణాల చేత ఎవరైనా సెలక్షన్స్‌కు హాజరుకాలేని పక్షంలో తనను స్వయంగా కలిసి విషయాన్ని వివరించాలని కోరారు. వారికి ఈ నెల 20వ తేదీన పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పరిశీలించిన ఎస్పీ గంగాధరరావు
Comments
Please login to add a commentAdd a comment