గన్నవరం: స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని బుద్దవరం గ్రామ శివారు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన గుర్రం శేషు(65) ఇళ్ల వెంట తిరుగుతూ అప్పడాలు, జంతికలు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సినిమా హాల్ సెంటర్ వద్ద జాతీయ రహదారి దాటుతున్న అతడిని విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేషు చాతి భాగంపై లారీ ముందు టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్ అదుపు తప్పి ఒకరి మృతి
పెనమలూరు: కానూరు 100 అడుగుల రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం గన్నవరానికి చెందిన మల్లాది ప్రశాంత్ అతని అన్న శాంతికిరణ్(32)తో కలిసి కానూరు కొత్త ఆటోనగర్‌లో ఎస్‌ఎల్‌ఎన్ ఎర్త్ మూవర్ కంపెనీ పెట్టారు. అయితే శుక్రవారం శాంతికిరణ్ బైక్‌పై కంపెనీకి వెళ్లాడు. సాయంత్రం బైక్‌పై గన్నవరానికి బయలుదేరాడు. అతను 100 అడుగుల రోడ్డులో అలంకార్ బార్ దాటిన తరువాత రోడ్డుపై కుక్క అడ్డు రావటంతో బ్రేక్ వేయగా బైక్ అదుపు తప్పి అతను రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాంతికిఱరణ్ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment