మరింత తగ్గిన ఉల్లి ధర | - | Sakshi
Sakshi News home page

మరింత తగ్గిన ఉల్లి ధర

Published Sat, Sep 28 2024 2:28 AM | Last Updated on Sat, Sep 28 2024 6:29 PM

-

క్వింటా గరిష్ట ధర రూ.4,009 

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గుతుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం మార్కెట్‌కు 158 మంది రైతులు 4,366 క్వింటాళ్ల ఉల్లి తీసుకొచ్చారు. ఈ నెల 26న క్వింటాకు గరిష్టంగా రూ.4,143 ధర లభించింది. తాజాగా గరిష్టంగా రూ.4,009 ధర పలికింది. అంటే క్వింటాపై రూ.134 తగ్గింది.

● కొర్రలు, సజ్జలు, ఆముదం ఽతదితర పంటల ధరలు నిరాశజనకంగా ఉన్నాయి. కొర్రలు మార్కెట్‌కు 343 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్టంగా రూ.2,029, గరిష్టంగా రూ. 2,875 లభించగా.. సగటు ధర రూ.2,499 నమోదైంది.

● సజ్జలు మార్కెట్‌కు 211 క్వింటాళ్లు రాగా కనిష్టంగా రూ.1,970, గరిష్టంగా రూ.2,111 లభించగా.. సగటు ధర రూ.2065 నమోదైంది.

● కందుల ధర జోరుమీద ఉంది.మార్కెట్‌కు కందులు 113 క్వింటాళ్లు రాగా కనిష్టంగా రూ.8,330, గరిష్టంగా రూ.10,282 లభించగా.. సగటు ధర రూ.10,222 నమోదైంది.

● వేరుశనగ 638 క్వింటాళ్లు రాగా కనిష్టంగా రూ.1,569, గరిష్టంగా రూ.7,010, సగటు ధర రూ.5066 నమోదైంది.

●ఆముదం మార్కెట్‌కు 594 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్టంగా రూ.5,390,కనిష్టంగా రూ.5,981 పలికింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement