క్రీడల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు మెండు
నంద్యాల(న్యూటౌన్): క్రీడల్లో రాణించే వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎన్‌ఆర్‌ఐ సురేంద్రనాథరెడ్డి తెలిపారు. రెండు రోజులుగా పద్మావతినగర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అండర్–17 ఎస్‌జీఎఫ్ బాల, బాలికల టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి క్రీడలు సోమవారంతో ముగిశాయి. ఎన్‌ఆర్‌ఐ సురేంద్రనాథ్‌రెడ్డితోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర పరిశీలకులు శ్రావణ్ కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలకు సమయం కేటాయించుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ కోచ్ ముంతాజ్ బేగం, ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ రెడ్డి, జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర, దండే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment