కర్నూలు సిటీ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్సిటీ నుంచి వచ్చిన ప్రత్యేక పరిశీలన బృందం సోమవారం కర్నూలు నగరంలోని మూడు కేంద్రాలను, గూడూరులోని ఒక కేంద్రాన్ని తనిఖీ చేసింది. కాగా గూడురులోని పరీక్ష కేంద్రంలో కొంత మంది దగ్గర చీటీలు పట్టుబడినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష కేంద్రాన్ని రద్దు చేసి కర్నూలు నగరంలోని కేంద్రాల్లో విద్యార్థులను పరీక్షలు రాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బైక్ ఢీకొని మహిళ మృతి
డోన్ టౌన్: బైక్ ఢీకొట్టడంతో సోమవారం ఓ మహిళ మృతిచెందింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన మాల లక్ష్మిదేవి(54) ఉదయం చిగురుమానుపేట సమీపంలోని కట్టెల డిపో వద్ద రోడ్డు దాటుతుండగా బోయ మధు అనే యువకుడు బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. తీవ్రగాయాల పాలైన మహిళను చికిత్స నిమ్మిత్తం కర్నూలుకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త వెంకటేశ్వర్లు గతంలోనే మృతి చెందగా అల్లుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐసీడీఎస్ చెంతకు చిన్నారి
డోన్ టౌన్: తల్లి హత్యకు గురై, తండ్రి జైలుకు వెళ్లడంతో ఒంటరిదైన ఐదు నెలల పసి పాప సృజనను పట్టణ పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సోమవారం అప్పజెప్పారు. గత నెల 30న తండ్రి రవీంద్ర చేతిలో తల్లి శాంతమ్మ దారుణ హత్యకు గురైన విషయం పాఠకులకు విధితమే. పోలీసుల దర్యాప్తులో భర్త రవీంద్ర హంతకుడిగా తేలడంతో అతడిని ఆదివారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి సృజనను కర్నూలు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించాలని సీఐ ఇంతయాజ్‌బాషా ఆదేశాల మేరకు ఐసీడీఎస్ సీడీపీఓ శంషాద్‌బేగంకు అప్పజెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment