సార్ నష్టపోతున్నాం.. ఆదుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు ఉల్లి రైతులు తమగోడును వినిపించారు. ఉల్లిలో పెట్టుబడి వ్యయం పెరిగిపోయిందని, ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ అయి ధరలు పెరుగకుండా చేస్తున్నారని వాపోయారు. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. సోమవారం కర్నూలుకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి టీజీ భరత్‌తో కలసి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ మంత్రి మాట్లాడుతూ.. ఉల్లి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటు రైతులు, అటు వినియోగదారులకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది అక్టోబరు నెలలో 52 వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చిందని, ఈ సారి 2.25 లక్షల క్వింటాళ్ల ఉల్లి వచ్చిందని తెలిపారు. ఉల్లి భారీగా రావడం, ఈ–నామ్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటం, టెండర్లలో జాప్యం జరుగడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. కర్నూలు మార్కెట్‌పై వత్తిడి తగ్గించేందుకు కోడుమూరులో ఉల్లి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ అధికారులను ఆదేశించారు. ఉల్లి రైతులు దళారీల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. మంత్రుల వెంట ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్‌బాష, జేసీ నవ్య, కర్నూలు ఆర్‌డీవో సందీఫ్‌కుమార్, ఏడీఎం నారాయణమూర్తి, మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నా రు. కాగా మంత్రులు హడావుడిగా వచ్చి..ౖపైపెన రైతులతో మాట్లాడి వెళ్ల్లిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రులు నిమ్మల, టీజీ భరత్‌కు
గోడు వెల్లబోసుకున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment