కర్నూలు(సెంట్రల్): ప్రజాసమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కొంతమంది అఽధికారులు సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో అర్జీలు రీఓపెన్ అవుతున్నాయన్నారు. కొన్ని శాఖల అధికారులు సంబంధంలేని అంశాలను అప్‌లోడ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు అంశాలను అప్‌లోడ్ చేసిన వెల్దుర్తి ఈఓపీఆర్‌డీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కర్నూలు ప్లానింగ్ విభాగపు అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. ఎండార్స్‌మెంట్, విచారణ నివేదికలను అప్‌లోడ్ చేయడంపై అధికారులకు సరైన అవగాహన లేని కారణంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డీఆర్వోను ఆదేశించారు. మరో వైపు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కారాలు చూపాలన్నారు. ఈవారంలో మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, నాగప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.
● నా కుమారుడిని వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని, వారి బారి నుంచి కాపాడాలని అమ్మ హాస్పిటల్ ఏరియాకు చెందిన హుస్సేన్‌బీ విన్నవించారు.
● కర్నూలు నగరంలోని 127వ వార్డు పరిధి బాలాజీనగర్, బృందావనం కాలనీల్లో వీధిలైట్లు వెలగడంలేదని, తాగునీటికి ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు మద్దిలేటి, కృష్ణ, శ్రీరాములు, శంకరరాజు, నగేష్ విన్నవించారు.
● చైన్నె – సూరత్ జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు ఇచ్చినా తమకు సరైన పరిహారం ఇవ్వడంలేదని ఆర్ కొంతలపాడుకు చెందిన చిలకరత్నం, రంగారడ్డి, తిరుపాలు కలెక్టర్‌కు విన్నవించారు.
● అర్హులైన వీఆర్‌ఏలకు అటెండర్, వాచ్‌మెన్, రికార్డు అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించాలని, తహసీల్దార్ కార్యాలయాలకు కాపాలగా ఉండే నైట్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు కలెక్టర్‌కు విన్నవించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment