జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఆదోని రూరల్: మండలంలోని పెద్దహరివాణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బోయ తలారి గర్జప్ప అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) కబడ్డీలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం పాఠశాల హెచ్‌ఎం ఇందిరాదేవి, పీఈటీ జి.రామన్న ఆ విద్యార్థిని అభినందించి మాట్లాడారు. అక్టోబర్ 27వ తేదీన అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఎస్‌జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపిక అయ్యారన్నారు. ఈ పోటీలు ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సంగపూర్‌లో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ రమేష్, ఉపాధ్యాయలు రమణమూర్తి, ఉపాధ్యాయేతర సిబ్బంది నవీన్‌కుమార్, గ్రామస్తులు ఉన్నారు.
అథ్లెటిక్స్‌లో..
కోసిగి: మండల పరిధిలోని కందుకూరు గ్రామానికి చెందిన కోసిగి రమేష్ కుమారుడు మల్లికార్జున అథ్లెటిక్స్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఆదోనిలో ఇంటర్ ఎంఎల్‌టీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఈ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఈనెల 2వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించి 5 కిలో మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈనెల 24 నుంచి 30వ తేది వరకు లక్నోలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్నట్లు కోచ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment