కర్నూలు(అగ్రికల్చర్): ఏపీసీడ్స్ 2024–25 సంవత్సరానికి సంబంధించి శనగ విత్తనోత్పత్తి చేపట్టింది. రబీలో 6000 ఎకరాల్లో విత్తనోత్సత్తి చేసే విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు లక్ష్యాన్ని ఇచ్చింది. ఏపీ సీడ్స్ అధికారులు విత్తనోత్పత్తి పట్ల ఆసక్తి ఉన్న రైతులను గుర్తిస్తోంది. ఇప్పటి వరకు 500 ఎకరాలకు విత్తనోత్పత్తికి అవసరమైన శనగ విత్తనాలను ఏపీసీడ్స్ సరఫరా చేసింది. జేజీ–11 రకం పౌండేషనన్ శనగ విత్తనాలను పూర్తి ధరపై రైతులకు అందజేస్తారు. పూర్తి ధర క్వింటాలుకు రూ.9,600 చెల్లించాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన శనగలను 2025–26 రబీ సీజన్ కోసం ఏపీ సీడ్స్ సేకరిస్తుంది. సీడ్ ఉత్పత్తి పట్ల ఆసక్తి ఉన్న రైతులు ఏపీ సీడ్స్ అధికారులను లేదా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించ వచ్చని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ధనలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment