పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా మంచి ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. దీనికితోడు చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి పొంతనలేని పరిస్థితి నెలకొనడంతో యువతలో అయోమయం, ఆందోళన నెలకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్య | - | Sakshi
Sakshi News home page

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా మంచి ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. దీనికితోడు చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి పొంతనలేని పరిస్థితి నెలకొనడంతో యువతలో అయోమయం, ఆందోళన నెలకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్య

Published Wed, Nov 6 2024 1:15 AM | Last Updated on Wed, Nov 6 2024 1:15 AM

పోటీ

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా

థర్డ్‌పార్టీని నమ్మి డబ్బులు మోసపోవద్దు

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలలో రెగ్యులర్‌, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఏదైనా సరే నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ అవుతాయి. ఎవ్వరైనా మాకు వారు తెలుసు, వీరు తెలుసని మాయమాటలు చెప్పి డబ్బులు అడిగితే ఇవ్వకూడదు. అలాగే ప్రైవేటు రంగంలోనూ కంపెనీలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తాయి. మా ద్వారా కూడా జాబ్‌మేళాలు నిర్వహించి ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటాం. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు, క్రెడిబిలిటీ లేని వెబ్‌సైట్స్‌ చూసి మోసపోవద్దు. ఏవైనా సందేహాలు ఉన్నా, ఉద్యోగాలకు ఆఫర్లు వస్తే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, సెట్కూరు కార్యాలయంలో కలిసి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. మధ్య దళారులను నమ్మి డబ్బలు ఇచ్చి మోసపోవద్దు.

– పి. దీప్తి, జిల్లా యువజన సంక్షేమాధికారి,

జిల్లా ఉపాధి కల్పనాధికారి, కర్నూలు

కంపెనీలు డబ్బులు అడగవు

కంపెనీలు ఎప్పుడూ ముందుగా డబ్బులు అడగవనేది నిరుద్యోగులు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా అడిగారంటే అవి కన్సల్టెన్సీసర్వీసెస్‌. మీ డబ్బులు తీసుకుని మూడు నెలల తర్వాత ప్రాజెక్టు రాలేదని లేదా మీ నైపుణ్యాలు కంపెనీకి సరిపోవని మిమ్మల్ని తీసేస్తారు. అలాగని వారు ముందుగానే అగ్రిమెంట్‌ కాగితంపై సంతకాలు చేయించుకుంటారు. దీనివల్ల వారిపై ఎక్కడా కేసు కూడా పెట్టలేని పరిస్థితి. మేము కొన్నేళ్లుగా నిరుద్యోగులకు మా సంస్థ ద్వారా కెరీర్‌ కౌన్సిలింగ్‌ శిక్షణ ఇస్తున్నాం. కొన్నేళ్లుగా మా సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా నిరుద్యోగులకు ఉచితంగా ఉద్యోగ అవకాశాల వివరాలను అందిస్తున్నాం.

– ఎస్‌.రాజశేఖర్‌, కెరీర్‌ కౌన్సిలర్‌, కర్నూలు

కొందరు అడ్డదారిలో ఉద్యోగ ప్రయత్నం

నిరుద్యోగులను నిలువునా

దోచుకుంటున్న మోసగాళ్లు

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ

రూ. లక్షల వసూళ్లు

ఆన్‌లైన్‌ వేదికగా మోసాలు

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న బాధితులు

కర్నూలు(హాస్పిటల్‌): ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోసానికి గురవుతున్న నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ‘మోసపోయాం.. న్యాయం చేయండి’ అంటూ అధికారులు, పోలీసు స్టేషన్ల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 85 డిగ్రీ కాలేజీలు, 8 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం 18 వేల మంది దాకా విద్యార్థులు డిగ్రీ పట్టాలు చేతబట్టుకుని బయటకు వస్తున్నారు. ఇలా బయటకు వచ్చిన వారు వెంటనే ఉద్యోగంలో చేరాలన్న ఆతృతతో ఎలాంటి స్కిల్స్‌ లేకపోయినా వారు.. వీరు.. చెప్పిన మాటలు నమ్మి మోసపోతున్నారు. కొందరు మోసగాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలిస్తామంటూ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. నిరుద్యోగులకు నైపుణ్యాలు లేకపోయినా సరే తాము నేర్పిస్తామని, మూడు నెలల్లో అద్భుతమైన ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ఈ మేరకు పలు కన్సల్టెన్సీ ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసిన ఏజెన్సీలు కూడా ఉన్నాయి. తీరా అక్కడ చేరాక మీలో నైపుణ్యాలు కంపెనికి సరిపడా లేవని, కంపెనీ నుంచి ఆర్డర్‌ వస్తే చెబుతామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. ఇలాంటి సంస్థలు ఎక్కువగా హైదరాబాద్‌, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ నిరుద్యోగులను బురిడీకొట్టిస్తున్నాయి. ఇందులో కొన్ని ట్రైనింగ్‌ కన్సల్టెన్సీ పేరుతో ట్రైనింగ్‌ ఫీజు కట్టించుకుంటున్నారు. శిక్షణ, ప్లేస్‌మెంట్‌ తర్వాత మార్కెట్‌ స్లోగా ఉందని ఉద్యోగులను వెనక్కి పంపించేస్తున్నారు. మరికొన్ని సంస్థలు నిరుద్యోగులు ఇచ్చే ప్యాకేజీని బట్టి నెలకు రూ.30 వేలతో ఉద్యోగం అంటూ చేర్చుకుని మొదటి నెల రూ.30 వేలు ఇస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు ఆగిపోయిందని, స్టార్ట్‌ అయ్యాక మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేస్తున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని మోసాలు

● ఇటీవల కాలంలో నంద్యాలలో గిగ్‌లీజ్‌ అనే సంస్థ నిరుద్యోగులకు రూ.1.20 కోట్లతో టోపీ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 170 మందిని తీసుకోగా అందులో 50 మంది నంద్యాలకు చెందిన వారే ఉండటం గమనార్హం.

● కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన అక్బర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఓ కంపెనీలో ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఇందుకోసం ఆ సంస్థ అతని వద్ద రూ.1.80 లక్షలు కట్టించుకుంది. జీతం రూ.20 వేలని, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగమని నమ్మబలికారు. 3 నెలల తర్వాత జీతం ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ తిప్పుకుంటున్నారు. వారి సంస్థలో పని చేసినట్లు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ కూడా ఇవ్వలేదు.

● బనగానపల్లెకి చెందిన మునిశేఖర్‌ యూట్యూబ్‌లో వచ్చిన ప్రకటనలకు ఆకర్షితుడై హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ముందుగా రూ.1.50 లక్షలు చెల్లించి ఉద్యోగంలో చేరాడు. ఇందుకోసం అతనికి కంపెనీ 3 నెలల పాటు శిక్షణ ఇచ్చింది. శిక్షణా కాలంలో అతనికి రూ.10 వేల చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత ఒక నెల ఉద్యోగం చేయించుకుని జీతం కూడా ఇవ్వకుండా కంపెనీకి పనికొచ్చే నైపుణ్యాలు నీ వద్ద లేవంటూ వెనక్కి పంపించేశారు.

● హైదరాబాద్‌కు చెందిన ఏవోఎల్‌ అండ్‌ డెకావర్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కర్నూలులో బ్రాంచ్‌ను ఓపెన్‌ చేసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలవేసింది. రూ.5 లక్షలు ఇస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ నమ్మ బలికింది. దీంతో కర్నూలుకు చెందిన అనూషతో పాటు మరో 18 మంది రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.95 లక్షలు వారికి ఇచ్చారు. మొదట ఆన్‌లైన్‌ శిక్షణ పేరుతో కొన్నాళ్లు కాలం గడిపారు. తర్వాత కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులను పట్టించుకోకపోవడంతో ఇటీవల వారు స్థానిక నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

● కర్నూలు నగరంలోని హోసన్నా మందిరం వద్ద ఉన్న శ్రేయాస్‌ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడని కల్లూరు మండలం ఉద్యోగనగర్‌కు చెందిన ప్రకాష్‌రాజ్‌ గత సోమవారం జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ఉద్యోగాలు

ఊరికే రావు..

ఇంజినీరింగ్‌ 3వ సంవత్సరం నుంచి జాబ్‌కు కావాల్సిన ప్రత్యేక స్కిల్స్‌ నేర్చుకుని ప్లేస్‌మెంట్స్‌కు సన్నద్ధం కావాలి.

చివరి సంవత్సరంలో ఇంటర్నిషిప్‌, ప్రాజెక్టు వర్క్‌ ఆన్‌లైన్‌లో గాకుండా ఆఫ్‌లైన్‌ ద్వారా చేయడం మంచిది.

కేవలం టెక్నికల్‌ స్కిల్స్‌కే పరిమితం గాకుండా ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో భాగంగా ఆప్టిట్యూట్‌, రీజనింగ్‌, ఆటిట్యూట్‌ (సాఫ్ట్‌స్కిల్స్‌)లో శిక్షణ తీసుకోవడం మంచిది.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని కేవలం జీతం అనే ఉద్దేశంతో వదులుకోవద్దు. కొంత మంది ఉద్యోగంలో చేరిన వెంటనే ఎక్కువ జీతానికి ఆశపడుతున్నారు. ఇలాంటి వారినే మోసగాళ్లు ఎంచుకుంటున్నారు.

డిగ్రీ పూర్తయిన వెంటనే మీ రెజ్యూమ్‌ను ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ నౌకరిడాట్‌కామ్‌, linkdinలో అప్‌లోడ్‌ చేయాలి.

నాన్‌ ఐటీ బ్రాంచెస్‌ వారు (మెకానిక్‌, సివిల్‌) త్వరగా ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఐటి సైడ్‌ పరుగెత్తకుండా మీ కోర్‌ బ్రాంచెస్‌లో లభిస్తున్న అవకాశాలన్నీ చూసుకోవాలి.

ఇటీవల కాలంలో వస్తున్న యూటూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పబ్లిసిటీల్లో చెబుతున్న ప్రకటనలకు తొందరపడి ఆకర్షితులు కావద్దు. ఏ బ్రాంచ్‌ వారైనా సరే త్వరగా ఉద్యోగం సంపాదించాలంటే ఐటీ శిక్షణ తీసుకోవాలి.

కాలేజ్‌ యాజమాన్యం ఏ బ్రాంచ్‌ వారికి ఆ బ్రాంచ్‌లో కల ఉద్యోగ అవకాశాలను క్యాంపస్‌లోనే తెలిపితే బాగుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా1
1/4

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా2
2/4

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా3
3/4

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా4
4/4

పోటీ ప్రపంచంలో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసినా కూడా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement