బాబూ.. సూపర్‌ సిక్స్‌కు నిధులే వీ? | - | Sakshi
Sakshi News home page

బాబూ.. సూపర్‌ సిక్స్‌కు నిధులే వీ?

Published Fri, Nov 15 2024 2:04 AM | Last Updated on Fri, Nov 15 2024 2:04 AM

బాబూ.. సూపర్‌ సిక్స్‌కు నిధులే వీ?

బాబూ.. సూపర్‌ సిక్స్‌కు నిధులే వీ?

కర్నూలు (టౌన్‌): ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలకు నిధులు కేటాయించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మరోసారి దగా చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా అంకెల గారడీ అని మండిపడ్డారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏ పథకానికి నిధులు కేటాయించలేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో చెప్పిన ప్రతి హామీని పక్కాగా అమలు చేయడమే కాక ప్రతి పథకం ప్రయోజనం లబ్ధిదారుడి ఖాతాలో జమ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత సర్కారు రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిందన్నారు. అయితే, బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించలేదన్నారు. అలాగే 3 గ్యాస్‌ సిలిండర్లకు రూ. 4 వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ. 890 కోట్లు కేటాయించిందన్నారు. దీని అర్థం మిలిగిన రెండు సిలిండర్లు ఎత్తెసినట్లు కాదా అని ప్రశ్నించారు. మంత్రి రామనాయుడు ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అన్నారు. బడ్జెట్‌లో ఆ ఊసేలేదన్నారు. నిరుద్యోగ భృతి కూడా అంతే అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో ఉచిత బస్సు ప్రయాణం అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి సర్కారు బెదిరింపులకు దిగుతుందని, వారికి అన్ని విధాలుగా పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

● నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు , రూ. 12 లక్షల కోట్లు అప్పు చేసిందని, రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు వారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 6 లక్షల కోట్లే అని ప్రకటించడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 2 డీఏ లు ఇచ్చిందని, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ప్రయోజనం కూడా చేకూర్చలేదన్నారు. డీఏలు లేవు, ఐఆర్‌లు లేవు అన్నారు. పీఆర్‌సీ గురించి పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చమని అడిగితే కూటమి సర్కారు కేసులు పెట్టి భయపెట్టడం సిగ్గుచేటన్నారు. జమిలీ ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయని, ప్రజలు బాబుకు గుణపాఠం చెబుతారన్నారు. పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సతీష్‌ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్న వారిని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వానికి పాలన చేతకాక వ్యతిరేకంగా మాట్లాడి వారిపై కేసులు నమోదు చేస్తుందన్నారు.

యురేనియంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో జరుగుతున్న యురేనియం తవ్వకాలను నిలుపుదల చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలు తెలుగు దేశం నాయకుల ఇళ్లను ముట్టడిస్తారన్నారు. బయట తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు.

కోర్టును ఆశ్రయిస్తాం

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కర్నూలులో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తా, నేషనల్‌ లా యూనివర్సిటీ ఇలా ఎన్నో సంస్థలు తీసుకువస్తే వాటిని తరలించేందుకు కూటమి సర్కారు కుట్ర చే స్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం చేస్తే సహించమని హెచ్చరించారు. సంస్థల తరలింపును నిలవరించేందుకు కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నగరపాలక స్టాండింగ్‌ కమిటీ సభ్యులు విక్రమ సింహారెడ్డి, జుబేర్‌, యూనుసూబాషా, కార్పొరేటర్లు షాషా వలి, ఆర్షియా ఫర్హీన్‌, నాయకులు ధనుంజయ ఆచారీ, షరీఫ్‌, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లో

పైసా కేటాయించకుండా దగా

తల్లికి వందనం,

నిరుద్యోగ భృతి ఊసే లేదు

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా

కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది

యురేనియంపై అసెంబ్లీలో

తీర్మానం చేయాలి

హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త తరలిస్తే

ప్రజా ఉద్యమం

విలేకరుల సమావేశంలో

వైఎస్సార్‌సీపీ నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement