108 ఉద్యోగుల సమ్మె సైరన్
కర్నూలు(హాస్పిటల్): అత్యవసర సేవలు అందించే 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25 నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు వారు గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపీడీఓలు, తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు. 108లో పనిచేస్తున్న ఈఎంటీ, పైలెట్లకు గ్రాట్యుటీ, ఎర్న్‌డ్ లీవ్ అమౌంట్, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించాలని కోరారు. అలాగే తమను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించి 108 సర్వీసును ప్రభుత్వమే నిర్వహించాలని, సిబ్బంది కొరత తీర్చాలని, అర్హులైన ఈఎంటీలను మెడికల్ కళాశాలల్లోని ఈఎంటీ పోస్టుల్లో నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాన్ని చెల్లించాలని, వైద్య ఆరోగ్య శాఖ నియామకాల్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని, రిలీవింగ్ బిల్లులు, ఎలక్ట్రికల్ బిల్లులు, వాహన మైనర్ మరమ్మతుల బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment