శ్రీమఠంలో కార్తీక త్రయోదశి
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో కార్తీక త్రయోదశి వేడుక మంగళ ప్రదంగా జరిగింది. గురువారం శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో వేడుకలు చేపట్టారు. ముందుగా తుంగభద్ర నదిలో దండోదక స్నానం గావించారు. అలాగే సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు శ్రీమన్ న్యాయసుధ గ్రంథంపై పవిత్ర నది నడిబొడ్డున పరీక్షలు నిర్వహించారు. ఆ గ్రంఽథంపై విద్యార్థులకు ఉన్న పరిజ్ఞానంపై పీఠాధిపతి ఆరా తీశారు. ఈ వేడుక శాస్త్రోకంగా జరగడం పలువురిని ఆకట్టుకుంది.
నేడు తుంగాహారతి
మండల కేంద్రంలోని తుంగభద్రనది తీరంలో శ్రీ మఠం తరఫున శుక్రవారం సాయంత్రం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ తుంగాహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment