మహిళ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Published Fri, Nov 22 2024 1:41 AM | Last Updated on Fri, Nov 22 2024 1:40 AM

మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం

జూపాడుబంగ్లా: మండల పరిధిలోని కనకయ్యకొట్టాలకు చెందిన బండారి విజయమ్మ(42) అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు.. కనకయ్యకొట్టాల గ్రామానికి చెందిన బండారి విజయమ్మనకు వెలుగోడు మండలం రేగడగూడూరుకు చెందిన గద్దా సుధాకర్‌కు గతంలో వివాహం కాగా వీరికి కూతురు ఉంది. కాగా 12 ఏళ్ల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి విజయమ్మ కనకయ్యకొట్టాల గ్రామంలోని సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 19న రాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తుండగా విజయమ్మ ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. ఉదయం తెలిసిన చోట్ల, బంధువుల వద్ద ఆరా తీయగా ఆచూకీ లేకపోవడంతో సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement