ఆత్మీయ స్వాగతం
● కర్నూలులో వివాహ రిసెప్షన్‌కు
హాజరైన వైఎస్ జగన్
● హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం పలికిన
పార్టీ ఉమ్మడి జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు
● చూసేందుకు భారీగా తరలి వచ్చిన
పార్టీ శ్రేణులు, అభిమానులు
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కర్నూలులో ఆత్మీయ స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బుధవారం ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. ఏపీఎస్‌పీ క్యాంపులోని హెలిపాడు వద్ద వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, ఎర్రకోట కేశవ రెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్రరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి మాజీ ఎంపీలు బుట్టారేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మణిగాంధీ, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, నాయకులు ఆదిమూలపు సతీష్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, గడ్డం రామకృష్ణ, మద్దూరు సుభాష్ చంద్రబోస్, ఎస్వీ విజయ మనోహరి తదితరులు ఘన స్వాగతం పలికారు. వారికి కరచాలనం చేసి ఆప్యాయంగా పలకరించిన మాజీ సీఎం అక్కడి నుంచి కారులో బళ్లారి చౌరస్తా, ఐటీసీ సర్కిల్ మీదుగా జీఆర్‌సీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. మార్గ మధ్యలో జగనన్నను చూసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వధూవరులను
ఆశీర్వదించిన మాజీ సీఎం
నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌లో నూతన వధూవరులు డాక్టర్ కె.చతుర, డాక్టర్ జి.నిఖిల్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాక్షాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జననేత వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పలువురు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో కన్వెన్షన్ ప్రాంతం కోలాహలంగా మారింది. అభిమానులకు అభివాదం చేస్తూ మాజీ సీఎం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. తర్వాత ఏపీఎస్‌పీ క్యాంపులోని హెలిపాడుకు చేరుకొని తాడేపల్లికి బయలు దేరారు. మాజీ సీఎంను కలిసిన వారిలో పార్టీ నాయకులు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, శశికళ, కాటసాని నరసింహారెడ్డి, ఎస్వీ జనక్‌దత్తా రెడ్డి, షరీఫ్, ఆదిమోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, హనుమంతరెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment