
21న రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు
కర్నూలు (టౌన్): ఈనెల 21, 22 తేదీల్లో స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా నెట్‌బాల్ సంఘం వ్యవస్థాపకులు కె.నాగరత్నమయ్య తెలిపారు. బుధవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ఈనెల 28న చైన్నెలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నెట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్ర జట్టు పాల్గొంటుందన్నారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరబాబు, ఆర్చరీ ట్రైనర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి మహానందీశ్వరుడి దర్శన వేళల్లో మార్పులు
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్ల దర్శనం వేళల్లో శుక్రవారం నుంచి స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఇప్పటిదాక ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు వరకు స్వామి, అమ్మవారి దర్శనం నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది. అయితే ఆలయ ఆచార వ్యవహారాలకు సంబంధించి వైదిక కమిటీ తీర్మానించిన మేరకు మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు అంటే గంటన్నర పాటు విరామం ఇవ్వనున్నారు. రేపటి నుంచి ఈమార్పును అమల్లోకి తెస్తున్న ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 2.00గంటల నుంచి భక్తులకు యథావిధిగా దర్శనం కొనసాగుతుందని, ఆలయం బయట ఉన్న రెండు చిన్నకోనేరుల్లో స్నానాలకు సైతం అనుమతి ఉంటుందన్నారు.

21న రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment