● రూ.లక్ష నగదు, 60 లీటర్ల
నాటుసారా స్వాధీనం
ఆదోని అర్బన్: పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా బీటర్లపై పోలీసులు దాడులు చేశారు. బుధవారం మట్కా బీటర్లు ఖాదర్, ఖాన్‌తోపాటు మరో నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.లక్ష నగదు, పేకముక్కలతోపాటు 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపారు.
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
కోసిగి: మండల పరిధిలోని పల్లెపాడు గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు తీవ్రగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నందవరం మండలం బాపురం గ్రామానికి చెందిన బోయ వీరేష్(26), స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి బైక్‌పై కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామంలో జరిగే దేవరకు హాజరయ్యారు. కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సాయంత్రం బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. పల్లెపాడు గ్రామ సమీపంలో జిల్లా పరిషత్ స్కూల్ మలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కింద పడ్డారు. ప్రమాదంలో వీరేష్ అక్కడికక్కడే మృతి చెందగా రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతినికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment