దేశాభివృద్ధికి విద్యావ్యవస్థ కీలకం
పాణ్యం: దేశాభివృద్ధికి విద్యావ్యవస్థ కీలకమని రాజమండ్రి స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ డాక్టర్ శంకర్ అన్నారు. బుధవారం నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భారత సంస్కృతి ప్రపంచంలోనే ఎంతో గొప్పదన్నారు. ప్రపంచానికి విలువైన మేధావులను, సాంకేతిక శాస్త్రవేత్తలను అందించిన ఘనత మనదేనన్నారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్థి చెందితే దేశం బలంగా ఉంటుందన్నారు. పురాతన ఆలయాల్లో సాంకేతిక నిర్మాణంపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోఽ అధ్యయనాలు జరిగాయన్నారు. నేటి విద్యార్థులు అధ్యాపకుల ద్వారా సరైన విద్యను పొందలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో డీన్ అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ జయచంద్రస్రసాద్, డాక్టర్ సోఫియా, ప్రియదర్శిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment