కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్ ఎస్‌ఈ వీ రామచంద్రారెడ్డి చెప్పారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో మాట్లాడుతూ మొత్తం 803 పనులకు గానూ ఇప్పటి వరకు 491 పనులు ఫిజికల్‌గా పూర్తయ్యాయన్నారు. పత్తికొండ సబ్ డివిజన్‌లో 72.73 శాతం, కోడుమూరులో 73.68, పాణ్యంలో 76.47, ఆదోనిలో 73.33, ఆలూరులో 66.50, మంత్రాలయంలో 55.56, ఎమ్మిగనూరులో 81.67 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇదే వేగాన్ని కొనసాగిస్తే ఈ నెలాఖరు నాటికి వంద శాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. వెనుకబడిన ఆలూరు, మంత్రాలయం సబ్ డివిజన్లలో పనుల వేగం పెంచాలని క్షేత్ర స్థాయిలోని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. బిల్లులను అప్‌లోడ్ చేసిన వెంటనే నిధులు విడుదలవుతున్నాయన్నారు. నాబార్డు కింద చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులు దాదాపు రూ.34 కోట్లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయన్నారు. పీఎంజీఎస్‌వై కింద కింద పెండింగ్‌లో ఉన్న రూ.2 కోట్లు రెండు, మూడు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
పీఆర్ ఎస్‌ఈ వీ రామచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment