500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
నందికొట్కూరు: పట్టణంలోని నీలిషికారిపేటలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 500 లీటర్ల బెల్లం ఊటను బుధవారం ఎకై ్సజ్ సీఐ రామాంజనేయులు నాయక్ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. షికారి దుర్గ వద్ద నుంచి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా నాటు సారా తయారు చేయడం నేరమన్నారు. సారా తయారు చేసినా, విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా క్రిమినల్ కేసులతోపాటు వాహనాలు సీజ్ చేసి జైల్‌కు పంపుతామని హెచ్చరించారు. సోదాల్లో పకై ్సజ్ ఎస్‌ఐ జఫ్రూల్లా, హెడ్ కానిస్టేబుళ్లు కుమారి, శంకర్ నాయక్, పద్మనాభం, పోలీసులు శివన్న, సుధీర్, కుమార్ పాల్గొన్నారు.
ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మహిళ దుర్మణం
ఓర్వకల్లు: ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ దుర్మణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్నూలు మండలం బి.తాండ్రపాడు సమీపంలో ఉన్న క్రెడో కార్పొరేట్ స్కూల్‌కు చెందిన బస్సు.. రాగమయూరిలోని విద్యార్థులను వదిలేందుకు బయలుదేరింది. రోడ్ నంబర్ 16లోని క్లాసిక్ అపార్ట్ మెంట్ వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా రివర్స్ తిప్పేక్రమంలో నన్నూరు గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య చంద్రమ్మ(50)ను ఢీకొంది. ప్రమాదంలో మహిళ తలకు, కుడి చేతికి బలమైన రక్త గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సునీల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నాగలదిన్నె ఎంపీపీ స్కూల్ హెచ్‌ఎం మృతి
నందవరం: మండలంలోని నాగలదిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బాబురాజు(55) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడ్డారు. నాగలదిన్నెలోని ఎంపీపీ స్కూల్‌లో గత 5 సంవత్సరాల నుంచి హెచ్‌ఎంగా విధులు నిర్వహించేవారని, యూటీఎఫ్ నాయకుడిగా, ఉపాధ్యాయుడిగా, హెచ్‌ఎంగా అందించిన సేవలు మరువలేనివని, ఆయన మృతి దిగ్భ్రాంతిని కలిగించిదని యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఎల్లప్ప అన్నారు.
విద్యుత్ తీగలు చోరీ
కొలిమిగుండ్ల: మండల కేంద్రంలోని పలువురి రైతుల పొలాల్లో బుధవారం గుర్తుతెలియని దుండగులు విద్యుత్ తీగలు చోరీ చేశారు. ఇటీవల వరుసగా తీగలు అపహరించుకుపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు చెన్నయ్య, బాలుడు, చిన్ని, నాగేశ్వరరావు, నరసింహుడు బోర్ల కింద వరి, మిరప పంటలు సాగు చేశారు. మోటార్ల నుంచి స్టార్టర్ల వరకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలను కట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఒక్కొక్కరి పొలంలో 20 నుంచి 30 మీటర్ల మేర తీగలు తీసుకెళ్లారని రైతులు పేర్కొన్నారు. పంటలకు తప్పనిసరిగా నీళ్లు పారించుకోవాల్సి రావడంతో కొత్తగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందన్నారు. కొద్ది రోజుల నుంచి కొంత మంది పనిగట్టుకొని చోరీకి పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
● సంజామల: మండల పరిధిలోని ఆల్వకొండ గ్రామానికి చెందిన రైతుల మోటర్ల కేబుల్ వైర్లు బుధవారం చోరీకి గురయ్యాయి. దాదాపు 20 మంది రైతుల వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వైర్ల విలువ రూ.50 వేలు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఆకుమల్ల, హోత్రమాన్‌దిన్నె, కమలపురి గ్రామాల్లో వరుసగా మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురైన సంగతి తెలసిందే. పోలీసులు దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment