జిల్లాతో మన్మోహన్ సింగ్‌కు అనుబంధం
కర్నూలు(సెంట్రల్): జిల్లాతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఎనలేని అనుబంధం ఉంది. ప్రధానమంత్రి హోదాలో ఆయన 2004లో కర్నూలు జిల్లాలో పర్యటించారు. గురువారం మన్మోహన్ సింగ్ కన్నుమూయడంతో జిల్లా ప్రజలు ఆయనను గుర్తు చేసుకున్నారు. 2004 జూలై ఒకటో తేదీన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లెకు వచ్చారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను మన్మోహన్‌సింగ్ పరామర్శించారు. ఒక్కో రైతు కుటుంబానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.5 లక్షల నగదు అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచారు. వెనుకబడిన కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అప్పట్లో సోమయాజుల పల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రకటించారు. 9 ఏళ్ల చంద్రబాబు పాలనకు చమర గీతం పాడిన తర్వాత మొదటిసారి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో పర్యటించారు. కాగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం కూడా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment