పలకరించకుండానే చికిత్స చేశారు
ఇటీవల నేను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మెడికల్ ఓపీకి చికిత్స కోసం వెళ్లాను. ముందుగా కూర్చున్న వైద్యుల వద్దకు నన్ను అక్కడి సిబ్బంది పంపించారు. ముందుగా కూర్బోబెట్టి నీ బాధేమిటని అడిగి ఊరుకున్నారు. నాకున్న ఇబ్బందులు వరుసగా చెబితే వెంటనే నాలుగైదు చీటీలు తీసుకుని వైద్యపరీక్షలు రాసి ఇచ్చారు. ఇవి చేయించుకుని రావాలని పంపించారు. ఆ పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తే డాక్టర్లు లేరు. తిరిగి ఓపీ ఉన్న మరో రోజు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా రిపోర్టులు చూసి మందులు రాసిచ్చి ఇవి వాడాలని చెప్పి పంపించారు. – శేఖర్, వీకర్‌సెక్షన్ కాలనీ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment