కుంభాభిషేకానికి ఉరుకుంద ముస్తాబు
కౌతాళం: కుంభాభిషేకానికి ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. క్షేత్ర పరిధిలో భక్తులకు ఇబ్బంది లేకుండా వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రధాన అర్చిగేట్‌కు ఇరువైపులా ఉన్న డివైడర్లను తొలగించి చదును చేస్తున్నారు. ఉత్తర ద్వారం వద్ద ఉన్న పాత కార్యాలయా న్ని పూర్తిగా పడగొట్టి చదును చేశారు. దక్షిణ ద్వారం నుంచి ప్రధాన అర్చిగేట్ వరకు ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మించిన నాలు గు రాజగోపురాలకు రంగుల వేయడం పూర్తి చేశారు. అన్నదానం సత్రంను విశాలంగా నిర్మిస్తా మని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి నాలుగు వైపులా ఐమ్యాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల విరాళాలతోనే పనులను చేపడుతున్నట్లు వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment