సంక్షేమ పాలన గుర్తులు చెరిపేస్తూ..
గత ప్రభుత్వ హయాంలో పాడుబడిన స్కూళ్లను నాడు–నేడు పేరుతో బాగు చేశారు. దెబ్బతిన్న రహదారులను నాడు–నేడు పేరుతో మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూశారు. ఈ ప్రభుత్వంలో మాత్రం రీసర్వే పూర్తయి భూముల సరిహద్దు రాళ్లపై ఉన్న వైఎస్‌ఆర్ జగనన్న భూ హక్కు–భూ రక్ష –2020 పేరును తుడిచి నాడు–నేడు కింద చూపుతున్నారు. నాడు–నేడు అంటే గత ప్రభుత్వానికి...ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలే గమనించాలి. ఎరేజింగ్ మిషన్లతో జగన్ పేరును తొలగించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో మొదటి విడతలో 99,454, రెండో విడతలో 39,874, మూడో విడతలో 1,22,154 మొత్తం 2,61,487 సర్వే రాళ్లను పాతారు.
Comments
Please login to add a commentAdd a comment