‘అఖండ’ వృషభం.. ఆకర్షణీయం
అఖండ సినిమాలో కనిపించి అలరించిన వృషభం బండలాగుడు పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె వచ్చిన నుంచి ఈ వృషభాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎమ్మిగనూరు జాతర సందర్భంగా స్థానిక వైడబ్ల్యూసీఎస్ మైదానంలో ఎద్దుల బండలాగుడు పోటీలు ఆదివారం ముగిశాయి. సీనియర్ వృషభాల విభాగ పోటీల్లో మొదటి స్థానాన్ని ఏ. నారాయణపురానికి చెందిన ఎద్దులు సాధించాయి. వాటి యజమాని మహమ్మద్ ఫరీద్‌కు రూ.లక్ష బహుమతి ఇచ్చారు. అలాగే ద్వితీయ బహుమతి రూ. 75 వేలును ధర్మవరం సుబ్బారెడ్డి, తృతీయ బహుమతి రూ.50 వేలను ప్రొద్దుటూరుకు చెందిన మర్తల చంద్రఓబుల్‌రెడ్డి తీసుకున్నారు. అఖండ వృషభానికి నాలుగో బహుమతి వచ్చింది. – ఎమ్మిగనూరుటౌన్
Comments
Please login to add a commentAdd a comment