పడగొట్టారు.. వదిలేశారు | - | Sakshi
Sakshi News home page

పడగొట్టారు.. వదిలేశారు

Published Mon, Jan 20 2025 1:35 AM | Last Updated on Mon, Jan 20 2025 1:35 AM

పడగొట్టారు.. వదిలేశారు

పడగొట్టారు.. వదిలేశారు

పాణ్యం: ఆర్‌అండ్‌బీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు విస్తరణ, కాల్వల నిర్మాణ పేరుతో పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో హడావుడిగా రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల ముందు మెట్లు, గోడలను కూల్చివేశారు. గత నెల 5వ తేదీన యంత్రాలతో తొలగింపు పనులు జరిగాయి. సాక్షాతు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఈ పనులను పరి శీలించారు. మరి నేటికి నెలన్నరవుతున్నా రోడ్డు విస్తరణ జరగలేదు..కాల్వల నిర్మాణం మొదలుకాలేదు. ఇళ్ల ముందు కూల్చివేతలతో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు కూడా తీవ్ర సమస్యగా మా రిందని వాహనదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే జాప్యంపై ఆర్‌అండ్‌బీ అధికారి వెంకటేశ్వరరెడ్డి వివరణ కోరగా ఆలమూరు గ్రామం మలుపు వద్ద నుంచి ముందున్న కాల్వలో వర్షపునీటిని కలిపేందుకు రూ. 14లక్షలతో ప్రతిపాదనలు పంపామని, అయి తే, ఈ పనులకు సంబంధించి ఇంకా అనుమతులు రాలేదని పేర్కొనడం గమనార్హం.

రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల ముందు మెట్లు, గోడలు కూల్చివేత

నెలన్నరవుతున్నా

మొదలుకాని పనులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement