డీఆర్‌యూసీసీగా విజయకుమార్‌రెడ్డి
కర్నూలు(హాస్పిటల్): డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్‌యుసీసీ) హైదరాబాద్ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వేగా కర్నూలుకు చెందిన ఐ. విజయకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా చైర్మన్‌గా ఉన్న ఈయన డీఆర్‌యుసీసీగా రెండేళ్ల పాటు పనిచేస్తారు. రైల్వే స్టేషన్‌లో ఏమైనా అభివృద్ధి పనులు, రైళ్లలో సౌకర్యాలు, కర్నూలు మీదుగా ఏమైనా కొత్తగా రైలు అవసరాలు ఉంటే ప్రజలు తనను సంప్రదించాలని ఆయన కోరారు.
ఆత్మకూరు వైద్య విద్యార్థికి నిమ్హాన్స్‌లో సీటు
ఆత్మకూరు రూరల్: బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌లో ఆత్మకూరుకు చెందిన వైద్య విద్యార్థి బుసగౌని తేజ్‌కుమార్‌గౌడ్‌కు సీటు వచ్చింది. ఐఎన్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఎట్రెన్స్ టెస్ట్‌లో ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్ సాధించడంతో ప్రతిష్టాత్మకమైన నిమ్హాన్స్‌లో న్యూరో సర్జరీలో సూపర్ స్పెషాలిటీ సీట్ వచ్చిందని తేజ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కాగా తేజ్‌కుమార్‌గౌడ్ పాండిచ్చేరి జిప్‌మర్‌లో ఎంబీబీఎస్, పీజీ చేశారు. వైద్య విద్యార్థిని పలువురు అభినందించారు.
నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోలు నిలుపుదల
ఆదోని అర్బన్: పట్టణంలోని ఆయా ఫ్యాక్టరీల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు పత్తి కొనుగోలు నిలుపుదల చేస్తున్నట్లు సీసీఐ ఇన్‌చార్జ్‌లు భరత్, గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి నిల్వలు ఎక్కువగా ఉండడంతో మూడు రోజులపాటు తాత్కాలికంగా కొనుగోలు నిలుపుదల చేస్తున్నామని తెలియజేశారు. పత్తి దిగుబడుల రైతులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment