బోరు బావిలో పైపులు దించుతుండగా ప్రమాదం
ఆదోని అర్బన్: చిన్నపెండేకల్ గ్రామంలో ఓ రైతు పొలంలోని బోరు బావిలో పైపులు దించుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన చెందిన రైతు చంద్రయ్యకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. మిరప సాగు చేస్తున్నాడు. కాగా పాత బోరులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రెండు నెలల క్రితం కొత్త బోరు తవ్వించారు. కాగా చంద్రయ్య, భార్య పుష్పావతి గురువారం బోరు బావిలో పైపులు దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడే ఉన్న దంపతులతో పాటు మరో వ్యక్తి జయరాజ్ ముఖాలు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పక్క పొలంలో పని చేస్తున్న వారు గుర్తించి గాయపడిన ముగ్గురిని ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పేలుడికి కారణాలు తెలియాల్సి ఉంది.
పేలుడు సంభవించి ముగ్గురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment