11 నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

11 నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Published Tue, Jan 7 2025 1:34 AM | Last Updated on Tue, Jan 7 2025 1:34 AM

11 నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

11 నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంటెంపుల్‌: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 11న ఉదయం 8.45 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, ముక్కోటి దేవతలను, సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ధ్వజారోహణ కార్యక్రమం చేపడతారు. ఈ నెల 12నుంచి స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, 14న మకరసంక్రాంతిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవ కల్యాణం, 16న యాగపూర్ణాహుతి, 17న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు నిలుపుదల

ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11నుంచి 17వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, గణపతిహోమం, శ్రీసుబ్రహ్మణ్యశ్వరస్వామి కల్యాణం, స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవలు నిలుపుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement