● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపోయిన తారు ● జిల్లాలో రూ.31 కోట్లతో 821 కిలోమీటర్ల మేర పనులు మంజూరు ● మసిపూసి మారేడు కాయ చేస్తున్న కూటమి నేతలు ● నేటికి ప్రారంభం కాని పలు రోడ్ల పనులు ● చోద్యం చూస్తున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపోయిన తారు ● జిల్లాలో రూ.31 కోట్లతో 821 కిలోమీటర్ల మేర పనులు మంజూరు ● మసిపూసి మారేడు కాయ చేస్తున్న కూటమి నేతలు ● నేటికి ప్రారంభం కాని పలు రోడ్ల పనులు ● చోద్యం చూస్తున్న అధికారులు

Published Wed, Jan 8 2025 1:22 AM | Last Updated on Wed, Jan 8 2025 1:22 AM

● గతు

● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపో

సీ బెళగల్‌ మండలం పోలకల్‌ నుంచి ముడుమాల వరకు కిలోమీటరు 3/5

నుంచి 5/6 వరకు (2.10 కిలోమీటర్లు ) బీటీ రోడ్డుకు ప్యాచ్‌ వర్కులు చేపట్టేందుకు రూ.12 లక్షలు మంజూరయ్యాయి. అయితే నేటికి పనులు ప్రారంభం కాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పలు గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఈ పనులకు సంబంధించి వెట్‌ మిక్స్‌ స్టాట్‌ చేశామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.

కర్నూలు(అర్బన్‌)/ న్యూసిటీ: ఎన్నికలకు ముందు రహదారుల నిర్వహణపై నానా హంగామా చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ... కొత్త రోడ్ల మాట దేవుడెరుగు, చేస్తున్న ప్యాచ్‌ వర్క్‌లపై కూడా పర్యవేక్షణ లోపించింది. ప్యాచ్‌లు వేసిన వారం పది రోజులకే తారు, కంకర వేరై పోయి యథా ప్రకారం గుంతలు దర్శనమిస్తున్నాయి. కేవలం రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టారు కానీ, ఆయా పనులు కూడా పూర్తి నాణ్యతతో చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేట్‌ హైవేస్‌, మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లపై కూడా పనులు అంతంత మాత్రంగానే చేపడుతున్నారు. ఎస్‌హెచ్‌, ఎండీఆర్‌ రోడ్ల పరిస్థితే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌అండ్‌బీ రోడ్లకు కేవలం పైపూతలు పూస్తు మమ అనిపిస్తున్నారు. మిషన్‌ పార్ట్‌ హోల్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా జిల్లాలోని కర్నూలు, ఆదోని డివిజన్లలో మొత్తం 821 కిలోమీటర్ల మేర రూ.31 కోట్లతో పనులు మంజూరు కాగా, రూ.20.66 కోట్లతో 163 పనులను చేపట్టారు. గత ఏడాది నవంబర్‌ 2వ తేదీన ప్రారంభించిన ఈ పనుల్లో ఇప్పటి వరకు 504 కిలోమీటర్ల మేర ప్యాచ్‌ వర్క్‌లు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

నాసిరకంగా పనులు ...

జిల్లాలోని పలు రోడ్లపై పనులు పూర్తి నాసిరకంగా చేపడుతున్నారు. దీంతో ఆయా రోడ్లపై పూడ్చిన గుంతల్లో ఇప్పటికే కంకర బయట పడడంతో వాహనదారుల ఇబ్బందులు తిరిగి ప్రారంభమయ్యాయి. చేస్తున్న పనులపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్ల అవతారమెత్తిన కూటమి నేతలు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. మరికొన్ని రోడ్లపై అసలు పనులే ప్రారంభించ లేదు. మరో పది రోజుల్లో చేపట్టిన అన్ని రోడ్ల పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇంకా అధికారుల లెక్కల ప్రకారం కర్నూలు డివిజన్‌లో 25 శాతం, ఆదోని డివిజన్‌లో 45 శాతం పనులను సంక్రాంతి పండుగ నాటికి ( కేవలం 10 రోజులు ) ఎలా పూర్తి చేస్తారో వారే చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చేసిన పనులకు కూడా పలు ప్రాంతాల్లో బిల్లులు చెల్లించనట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో 50 కిలోమీటర్ల మేర చేపట్టిన ప్యాచ్‌ వర్క్‌లకు రూ.80 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో

సభ్యుల ఆందోళన ...

గత నెల 28వ తేదీన జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులు అధ్వాన రోడ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ప్యాచ్‌ వర్కుల్లో కర్నూలు డివిజన్‌లో 75 శాతం, ఆదోని డివిజన్‌లో 55 శాతం పూర్తయ్యా యని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చెబుతుండగా.. పలువు రు జెడ్పీటీసీలు అడ్డుతగిలారు. కర్నూలు జిల్లా కోడుమూరు – వెల్దుర్తి, మద్దికెర – బురుజుల, మద్దికెర– కసాపురం, మిడ్తూరు – గార్గేయపురం రోడ్లతో పాటు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు– పగిడ్యాల, గడివేముల – మంచాలకట్ట, మహానంది మండలంలో పలు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ చిత్రం పత్తికొండ – గుత్తి రహదారిలో రాతన గ్రామంలో ప్యాచ్‌లు వేసిన ప్రదేశం. ఈ రహదారిలో రూ.13 లక్షలతో 9 కిలోమీటర్ల మేర ప్యాచ్‌ వర్క్‌లు చేపట్టారు. అయితే ప్యాచ్‌లు వేసిన 10–15 రోజుల్లోపే తారు కరిగి పోయి మళ్లీ గుంతలు దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రోడ్ల ప్యాచ్‌ల నాణ్యత ఏ పాటిదో ఇట్టే అర్థమవుతోంది.

పత్తికొండ – ఆదోని రోడ్డులో రూ.5 లక్షల వ్యయంతో ఏడు కిలోమీటర్ల మేర పలు చోట్ల ప్యాచ్‌ వర్కులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో వేసిన ప్యాచ్‌లు వేసినట్లుగా ఇలా ఛిద్రమయ్యాయి.

అంచనా మొత్తం కూడా పెంచి...

పలు ప్రాంతాల్లో చేపడుతున్న పనుల అంచనా మొత్తా న్ని కూడా పెంచినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక కూటమి నేతల జేబులు నింపేందుకు అంచనా లు రూపొందించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్కువ ప్యాచ్‌ వర్కులు ఉన్న రోడ్లకు కూడా రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. పైగా జంగిల్‌ క్లియరెన్స్‌, గుంతలు పూడ్చడం పనులతో చోటా నేతలకు ముందే సంక్రాంతి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపో1
1/3

● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపో

● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపో2
2/3

● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపో

● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపో3
3/3

● గతుకులకు నాసిరకం అతుకులు ● వేసిన 10–15 రోజులకే లేచిపో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement