● పరారీలో మరో ఐదుగురు
ఆదోని అర్బన్: జిల్లాలో సంచలనం సృష్టించిన ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్‌ల పర్వం మొదలైంది. బతికున్న ఎగ్గటి ఈశ్వరయ్య పేరుతో నకిలీ మరణ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌తో రూ.35 కోట్లు విలువచేసే 6.51 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో పది మందిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని సీఐ సూర్యమోహన్‌రావు తెలిపారు. అరెస్టు అయిన వారిలో రిజిస్ట్రేషన్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేష్, డాక్యుమెంట్ రైటర్లు షేక్ మహబూబ్, షేక్ షబ్బీర్, విట్‌నెస్‌గా ఉన్న ఇజాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. పరారైన వారిలో సబ్ రిజిస్ట్రార్ హజీమియా, రిజిస్ట్రేషన్ చేయించిన ఎగ్గటి ఆముదాల భాస్కర్, చేసుకున్న చాకలి ఈరన్న, సాక్షులు ఈరన్న, లోకనాథ్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. త్వరలో ఈ ఐదుగురిని కూడా పట్టుకుంటామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment