మహబూబాబాద్ అర్బన్: ఇన్‌స్పైర్ మానక్ 9వ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికై న జిల్లాకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 10నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్–2023 కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లా నుంచి నక్క భవాని, ఎడ్ల నాని హాజరుకానున్నారు. జాతీయస్థాయిలో ఎంపికై న 60 ఎగ్జిబిట్లలో తెలంగాణ నుంచి 8ప్రదర్శనలు ఉన్నాయి. ఇందులో జిల్లా నుంచి రెండు ఎగిబిట్లు ఎంపికయ్యాయి. కాగా విద్యార్థులను, గైడ్ టీచర్లను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ శశాంక బుధవారం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment