![వైద్యులు, సిబ్బంది కోసం ఎదురు చూస్తున్న రోగులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/7/06drk200-330158_mr.jpg.webp?itok=_q3tKMm8)
వైద్యులు, సిబ్బంది కోసం ఎదురు చూస్తున్న రోగులు
దంతాలపల్లి: మండల కేంద్రంలోని ప్రజావైద్యశాలలో వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తూ 24 గంటల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చి, అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దంతాలపల్లి ఆస్పత్రిలో మాత్రం 24 గంటల వైద్యసేవలు అందడం లేదు. నర్సింహులపేట, దంతాలపల్లి ఉమ్మడి మండలాలకు ఒక్కటే ఆస్పత్రి కావడంతో అధిక సంఖ్యలో రోగులు వస్తారు. గురువారం నర్సింహులపేట మండలం పెద్దనాగారం, వంతడపల, పడిమటిగూడెం గ్రామాలనుంచి గర్భిణులు, షుగర్ పేషంట్లు, కోతి కరిచిందని మరొకరు వచ్చారు. కానీ, ఉదయం 9 గంటలు దాటిన కనీసం డ్యూటీ నర్సులు లేకపోవడంతో ఆస్పత్రి ఎదుటే నిరీక్షించారు. ఆస్పత్రికి ఇద్దరు మహిళా డాక్టర్లను నియమించినప్పటికీ 9:30 నిమిషాలకు ఒక వైద్యురాలు విధులకు హాజరై రోగులకు పరీక్షలు నిర్వహించారు. కాగా మధ్యాహ్నం 1:30 వరకు ఏ ఒక్క నర్సు విధుల్లో రాలేదు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు మందులు అందజేసే దిక్కులేకుండాపోయింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని కోరుతున్నారు.
సమయపాలన పాటించని
వైద్యాధికారులు, సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment