ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో డీఎస్పీ వెంకటేశ్వరబాబు
తొర్రూరు: విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలని డీఎస్పీ వెంకటేశ్వరబాబు అన్నారు. పోపా ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్ భవనంలో మంగళవారం పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. టెన్త్, ఇంటర్, ఐఐటీ, మెడిసిన్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి డీఎస్పీ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రతిభలో ఎవరికీ తీసిపోరని, వారికి ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. కార్యక్రమంలో పోపా ప్రతినిధులు రాపోలు ప్రభాకర్, బుదారపు శ్రీనివాస్, కోట వెంకటేశ్వర్లు, గడ్డం ఈశ్వర్, కూరపాటి సోమయ్య, మిట్టకోల రవి, కస్తూరి పులేందర్, చిట్యాల వెంకన్న, పెండెం రమేష్, రవీంద్రకుమార్ ల్గొన్నారు.
డీఎస్పీ వెంకటేశ్వరబాబు
Comments
Please login to add a commentAdd a comment