సమావేశంలో మాట్లాడుతున్న సంజీవ
వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని నిరసిస్తూ ఈనెల 29న బస్ డిపోల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆటో యూనియన్ల ఐక్యవేదిక బాధ్యుడు ఇసంపెల్లి సంజీవ తెలిపారు. బుధవారం వరంగల్ గోవిందరాజుల గుట్ట ప్రాంతంలో వివిధ ఆటో యూనియన్ల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు దశల వారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో మడికొండ బాబు, ఎండి. సిరాజ్, బొల్లం సంజీవ, శివ ప్రసాద్, రమేష్, శ్రీనివాస్, మనోహర్, జయరాజు, మల్లయ్య, శ్రీధర్ రెడ్డి, పూజారి రవి, సాగర్, నరేష్, సురేష్, చీకటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment