‘సంప్రదాయాలను కాపాడుకోవాలి’
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన అరుణ్‌కుమార్ అన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం మేడారంలో సమ్మక్క భవనంలో ఆదివాసీ పూజారులతో సంస్కృతి పరిరక్షణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమ్మక్క– సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు పూజారులను, గ్రామస్థాయిలో ఉన్న పూజారులను కాపాడుకోవాలన్నారు. పూజారుల ద్వారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ జరుగుతుందని, ప్రజలలో ఐక్యత వస్తుందని తెలిపారు. వనవాసీ కల్యాణ పరిషత్ ప్రాంత శ్రద్ధ జాగరణ ప్రముఖ్ పరుశురాములు, సమ్మక్క– సారలమ్మ ఆవాస ప్రముఖ్ సాంబయ్య, చర్పా కిసాన్‌రావు, కార్యదర్శి మైపతి సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment