నేడు కౌన్సిల్ సాధారణ సమావేశం
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ కార్యాలయంలో ఈనెల 23న ఉదయం 10.30గంటలకు కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనున్నారు. 187 ప్రతిపాదనలతో కూడిన ఎజెండాను తయారు చేసి కౌన్సిలర్లకు అందజేశారు. ఎజెండాలో పెద్దగా ప్రాధాన్యత ఉన్న అంశాలు లేవు. మొదటి, రెండో ప్రతిపాదనలు పశుసంత వేలంపాట ప్రకటనల బిల్లులు ఉన్నాయి. సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులవి కొన్ని ప్రతిపాదనలు ఉండగా.. మరికొన్ని లైటింగ్, సౌండ్ సిస్టమ్ డెకరేషన్ బిల్లులు ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌లో డీజిల్, పెట్రోలు, రూ.2,66,627 బిల్లులు, అక్టోబర్‌లో రూ.2,83,351, నవంబర్‌లో రూ.3,67,025 బిల్లులు ఉన్నాయి. వాటితో పాటు ఫాగింగ్ వాహనాల డీజిలు బిల్లులు మాత్రమే ఉన్నాయి. అలాగే విగ్రహాల ప్రారంభోత్సవాలకు అయ్యే ఖర్చుల బిల్లుల ప్రతిపాదనలు మాత్రమే పొందుపర్చారు. గ్రీన్‌ల్యాండ్‌లు, ఇంటి నంబర్లు, అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50 కోట్లు తదితర అంశాలపై ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది.
ఎజెండాలో 187 ప్రతిపాదనలు
ఎక్కువగా పెట్రోలు, డీజిల్, వెల్డింగ్, మరమ్మతుల బిల్లులు
Comments
Please login to add a commentAdd a comment