షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వర్తించాలి
మహబూబాబాద్: ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల విధుల నిర్వర్తించాలని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫామ్–6,7,8లను వెంటనే పరిష్కరించాలని, దివ్యాంగ ఓటర్లను గుర్తించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. నాణ్యమైన ఓటర్ ఎపిక్ కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేయాలన్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంప్‌లు, తాగునీరు, మరుగు దొడ్లు, విద్యుత్‌సరఫరా, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు గణేష్, కృష్ణవేణి, స్వీప్ నోడల్ అధికారి మధుసూదన్‌రాజు సంబంధిత అధికా రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment