మండలిలో ఉపాధ్యాయుల గళం వినిపిస్తా..
● ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి
తొర్రూరు: ఎమ్మెల్సీగా తనకు అవకాశమిస్తే మండలిలో ఉపాధ్యాయుల గళం సమర్థంగా వినిపిస్తానని తెలంగాణ పీఆర్‌టీయూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం రాత్రి తెలంగాణ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రఘురెడ్డితో కలిసి హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో ఎమ్మెల్సీలుగా పని చేసి న నాయకులు ఉపాధ్యాయుల సమస్యలు విస్మరించారన్నారు. వారి నిర్వాకం వల్లే 317 జీఓ వచ్చిందని, వేతనాల్లో ఆలస్యం జరిగిందన్నారు. తమ కృషితో భాషా పండితులకు పదోన్నతులు లభించాయని గుర్తు చేశారు. ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమామ్ మహ్మద్, రాష్ట్ర నాయకులు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, చక్రారెడ్డి, భూపతిసింగ్, ఓం ప్రకాశ్, వివేక్, శ్యామ్‌బాబు, శిరీష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment